30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అన్ని కాలువలకు చివరి తడి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు:  కాకతీయ కాలువ (  LMD పైన ), సరస్వతి కాలువ లక్ష్మీ కాలువ & లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల ఆయకట్టు రైతలకు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి (SCIWAM) కమిటీ నిర్ణయించిన సాగునీటి ప్రణాళిక ప్రకారం- కాకతీయ ప్రధాన కాలువ ,  సరస్వతి కాలువ, లక్ష్మీ కాలువ, అలీ సాగర్ & గుత్ప లిఫ్ట్   ఇరిగేషన్ స్కీమ్స్, సూక్ష్మ నీటిపారుదల లిఫ్ట్ స్కీముల ఆయకట్టుకు 09.04.2025 బుధవారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సాగునీరు ఇవ్వబడునని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపర్డెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. దీని తర్వాత ప్రాజెక్టు నుండి సాగునీరు ఇవ్వడం ఎట్టి పరిస్థితులలో  సాధ్యపడదని పేర్కొన్నారు. ఇదే చివరి తడి అని అన్ని కాలువల పరిధిలోని రైతులందరూ గమనించగలరని తెలియజేశారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి.  సాగునీటి వినియోగం తర్వాత ప్రాజెక్ట్ లో మిగిలే నీటిని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, నిర్మల్ , అదిలాబాద్ జిల్లాల తాగునీరు కోసం వినియోగించుకునే  విధంగా సహకరించాలని రైతులందరికీ తెలియజేశారు. కాకతీయ కాలువ లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల , కాలువ దరిదాపుల్లోకి సామాన్య ప్రజలు ఎవరూ రావద్దని , ప్రమాదానికి గురికావద్దని తెలిపారు.

More articles

Latest article