27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : కుల మతాల వివక్ష లేకుండా సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం, సమ సమాజ స్థాపనే ద్యేయంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కృషి చేశారని,సర్వాయి పాపన్న సేవలు చరిత్రను నిలిచిపోతాయని మండల గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మండల గౌడ సంఘం నాయకులు, బహుజనులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిల్చాడని, సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వంశీకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎండి ఫరీద్, మచ్చేందర్ గౌడ్, సంగయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article