26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ గత పదేళ్ల పాలన పూర్తి అవినీతిమయం

Must read

📰 Generate e-Paper Clip

. . . కేటీఆర్, హరీష్ రావుకు దమ్ముoటే బహిరంగ చర్చకు రమ్మనండి

 

. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ గత పదేళ్ల పాలన పూర్తి అవినీతి, అక్రమాలకు పాల్పడిందని టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. పసలేని ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తులు జరుగుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సింగరేణి తో పాటు అనేక సంస్థలను ప్రక్షాళన చేసి సంస్థ బలోపేత మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్ల కాలంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేటిఆర్, హరీష్ రావు లు చేస్తున్న ఆరోపణలు గత బీఆర్ఎస్ హయంలోనే జరిగాయన్నారు. సింగరేణిలో జరిగిన కాంట్రాక్ట్ లు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. మీరు చేసే ప్రతీ ఆరోపణలకు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో టెలిగ్రాఫ్ చట్టంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత భయంకరమైనదన్నారు. సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై సైతం ఫోన్ ట్యాపింగ్ చేసారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎలాంటి చర్చకైన సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆర్థికాన్ని పెద్ద మొత్తంలో గండి కొట్టారన్నారు. రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. దేవుళ్ళ పేరుతో ఓట్లు అడిగే వాళ్ళం కాదని, దేవుళ్ళ పేరుతో రాజకీయం చేసే మీరు ఎలాంటి అభివృద్ధి చేశారని మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాకు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ళ పేర్లను వాడుకోవద్దని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ నిజామాబాద్ ను ఎంపీ అర్వింద్ ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ జీవితం కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్యాకేజీలపై ఆధారపడిన జీవితం నాది కాదు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article