బీఆర్ఎస్ గత పదేళ్ల పాలన పూర్తి అవినీతిమయం
. . . కేటీఆర్, హరీష్ రావుకు దమ్ముoటే బహిరంగ చర్చకు రమ్మనండి . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ గత పదేళ్ల పాలన పూర్తి అవినీతి, అక్రమాలకు పాల్పడిందని టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...