- సస్పెన్షన్ వేటును తప్పించుకోవడానికి అదేకారణమా..?
- భవన నిర్మాణాలకు కంట్రిబ్యూషన్ చేయడంతోనే శాఖాపరమైన చర్యలు శూన్యమా..?
- చర్చనీయాంశంగా మారిన ఎక్సైజ్ సీఐ అకస్మాత్తు బదిలీ
నిజామాబాద్, బతుకమ్మ : రేషన్ (ఈత చెట్లు) లేవని మూసివేసిన కల్లుబట్టిని మాముళ్లు తీసుకోని కోర్టు అనుమతి లేకున్న కల్లుబట్టి తెరిపించిన ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓను సస్పెండ్ చేయండి అని అధికార పార్టీ నేత ఎక్సైజ్ శాఖ బాస్ కు సిఫారసు చేసారట. రూల్స్ ప్రకారం ఐతే లంచం తీసుకోవడం తప్పే కాబట్టి అ అధికారిని సస్పెండ్ చేయాలి. అదిను కాక అధికార పార్టీ అగ్రనేత ఆదేశాలు పాటించాలి. కాని అబ్కారీ శాఖ బాస్ మాత్రం సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ సిఐ పై వేటు వేయకుండా అక్కడి నుంచి తప్పించారు అనే టాక్ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అంటే బదిలీ చేసి మమా అనిపించారు అన్నమాట. అధికార పార్టీ నేత ఆదేశాలు ఇక్కడ బేఖాతరు కావడానికి కారణం ఎక్సైజ్ శాఖ మాముళ్ల వ్యవహరం అని ఇందూర్ జిల్లాలో హాట్ హాట్ గా జరుగుతుంది. ఎందుకంటే సదరు ఎక్సైజ్ సిఐ మామూళ్లు తీసుకుని జేబులు నింపుకోవడం లేదని , ప్రభుత్వం వద్ద నిధులు లేక ఎక్సైజ్ శాఖ భవనాల నిర్మాణాలకు ఆ డబ్బులు వెచ్చించారని జిల్లా బాస్ లు అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు నివేధించడంతోనే ఎక్సైజ్ సిఐ వేటు పడకుండా తప్పించుకున్నడని ఆ శాఖ అంతా కోడై కూస్తుంది..
నిజమాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖ మాముళ్ల ట్రేండ్ మరోలా ఉంది. ఇక్కడ అమ్యామ్యాలు (మాముళ్లు) తీసుకుంటున్నప్పటికి అతి పేద (ఖజానా నింపే ప్రధాన మైన ఎక్సైజ్ ) శాఖ కోసం వెచ్చిస్తున్నారటా అధికారులు, ఉద్యోగులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కల్లు (సొసైటీ) లకు ప్రసిద్ధి. దాదాపు 300 నుంచి 400 పైచిలుకు సొసైటీలు ఉన్నాయి. 152 మద్యం (వైన్స్ లు) దుకాణాలు, 12 బార్ లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వానికి అబ్కారీ శాఖ ద్వార వచ్చే ఆదాయంలో ఇందూర్ జిల్లా మూడో, నాల్గవ స్థానంలో ఉంది. అయితే ఎక్సైజ్ శాఖలో నెల వారి మాముళ్లు లక్షల్లో ఉంటుంది అనే టాక్ ఉంది. అందుకే నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్ హాట్ కేక్ అని వినికిడి. ఇక్కడ పోస్టింగ్ అయ్యే ఖర్చు నెల రెండు నెలలోనే వస్తాయనే నమ్మకంతోనే విధులలో చేరుతున్న అధికారులు అందిన కాడికి వసూళ్లు చేస్తున్నారు. అవి కాదని ఉమ్మడి జిల్లాలో రేషన్ (ఈత చెట్లు) లేకున్న ఉన్నాయని తప్పుడు లెక్కలతో కల్లు సేకరణ అంటు డిపోలలో కల్తీ కల్లు తయారు అనేది జగమెరిగిన సత్యం. దశాబ్ధాలుగా నిషేధిత మత్తు పదార్థాలను కలిపి కల్లు తయారు అవుతుంటే చూసి చూడకుండా ఉంటే వచ్చే మాముళ్లే సొసైటీలు (డిపో) ల ద్వార ప్రతి నెల రావడమే ఎక్సైజ్ శాఖలో అధికారుల ప్రధాన ఆదాయ వనరుగా ఉందనే అబ్కారీ శాఖలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరుచెప్పే మాటనే.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. కాని చాలావాటికి సొంత భవనాలు లేవు. ఇప్పటికి అద్దె భవనాలలోనే డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంతో పాటు ఎస్ హెచ్ఓ (ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లు) కార్యాలయాలు, ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ కార్యలయాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లకు శంకుస్థాపన చేశారు. నిధుల లేమి కారణంగా అవి నత్తనడకన నడిచే సరికి ఇక్కడ అధికారులకు వచ్చే మాముళ్లతోనే వాటిని పూర్తి చేశారు అనేది అందరికి తెలిసిందే. అదే విధంగా ఉద్యోగులు కుడా తమ వేతనాల నుంచి కంట్రిబ్యూషన్ చేసి ఇతోధికంగా తోడ్పడిన విషయం కమీషనరేట్ వరకు విధితమే. వాటిని సంపూర్ణంగా నిర్మాణం చేసి కొత్త ప్రభుత్వం హయాంలో కొత్త ఎక్సైజ్ మంత్రి చేత ప్రారంభింప చేశారు. ప్రస్తుతం కుడా రెండు మూడు భవనాల నిర్మాణం జరుగుతుండగా నిధుల లేమితో అవి అసంపూర్ణంగా ఉండటంతో స్థానికంగా ఎస్ హెచ్ఓ లకు వాటి నిర్మాణం పూర్తి చేసే భాధ్యతలు అప్పగించారంటా ఎక్సైజ్ బాసులు. అందులో భాగంగానే ఒక సొసైటీ (కల్లు మూస్తేదారుల) వద్ద తీసుకున్న అమ్యామ్యాలతోనే వాటినే పూర్తి చేస్తుండగా, ఆ సొసైటీ అంటే గిట్టని వారు చేసిన ఫిర్యాదు విషయంలో ప్రజా ప్రతినిధి సిఫారసును ఎక్సైజ్ ఉన్నతాధిరకారులు పట్టించుకోలేదని టాక్ ఉమ్మడి జిల్లాలో ట్రెండింగ్ అవుతుంది.
