25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాసిన కాగితాన్ని ఖార్గే చూసి చదివితే అబద్దాలు నిజం కావు 

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ చెప్పి చేసింది ఒక్కటే ఢిల్లీకి డబ్బులు పంపడం 
  • ఖార్గేజీ క్షేత్రస్థాయికచ్చి తెలుసుకో మీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో 
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ రాసి ఇచ్చిన కాగితాన్ని చదువుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేసింది అనే అబద్దం నిజమైపోదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ హామీలను అమలు చేశామని చెప్పి తమ పార్టీ జాతీయ అధ్యక్షునీతోనే అబద్దాన్ని అందంగా ఆడించారని ఆయన ఏద్దేవా చేశారు. రాసి ఇచ్చిన కాగితం చూసి చదవడం కాదని, క్షేత్రస్థాయిలో ఖార్గే స్వయంగా వచ్చి తిరిగితే ప్రజలు ప్రభుత్వ హామీల అమలు గురించి ఏం మాట్లాడుతారో తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఏం చెబితే అదే చేస్తుందని ఖార్గే అనడం హాస్యాస్పదమని,కాంగ్రెస్ చెప్పింది చేసిన మాట ఏంటంటే ఢిల్లీకి డబ్బుల మూటలు హైకమాండ్ చెప్పిన విధంగా పంపడేమేనన్నారు. కాంగ్రెస్ చేసింది కేసీఆర్ పెట్టిన క్యాంటీన్ల పేర్లు మార్చడం, కేసీఆర్ నోటిఫికెషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, రిజల్ట్ వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మేము 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పులు చెప్పుకోవడం మని,పట్నం లో కేటీఆర్ కట్టించిన ఫ్లైఓవర్ ను ప్రారంభించి గొప్పగా చెప్పుకోవడమేనని విమర్శించారు. నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ రోజు నిరుద్యోగులు నిరసన పిలుపునెందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొని మీరు నిరసన తెలిపిన నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేసారన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు చెప్పే రేవంత్ రెడ్డి తీరు మందికి పుట్టిన బిడ్డెను మా బిడ్డాఅని ముద్దడినట్లుందని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

More articles

Latest article