బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ లోని జిల్లా పరిషత్ గర్ల్స్ ఉన్నత పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుదం భోజన్న, రాష్ట్ర బాధ్యులు లింగన్న పోశెట్టి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిన భాజం రాజేశ్వర్, మామిడి రవీందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
