బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ను చేనేత సహకార సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీలకంటి సంతోష్, పిట్లం నీలకంఠ సమాజ అధ్యక్షులు మరగల దయానంద్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గూడ నరసింహులు, దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెవుల శ్రీనివాస్, చేనేత సంఘం సభ్యులు, మరగల రాములు, సన్నపుల దత్తు, బైరోళ్ళ రోహన్, దోమల్వర్ శ్రీకాంత్, మర్గల శ్రీనివాస్, పెంట్ రామ్ సప్తగిరి వెంకటేష్, అన్నం నందు మరియు సభ్యులు పాల్గొన్నారు.
