24.7 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ సమర్థ రామ్ దాస్ స్వామి జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : పతంజలి యజ్ఞ సహిత యోగ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని పతంజలి యోగ భవనంలో శ్రీ సమర్థ రామదాసు స్వామి 418 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ.. ఈయన చత్రపతి శివాజీ యొక్క గురువుని, అదేవిధంగా రామభక్తుడు, హనుమాన్ భక్తుడు కావడం ద్వారా ఈయనకు సమర్థ రామదాసు స్వామి అని పిలుస్తారన్నారు. ఈయన మహారాష్ట్రలోని 1608 జామ్  గ్రామం ,జాల్నా జిల్లాలో జన్మించాడు. ఈయన  సజ్జన్గడ్  సతారా జిల్లా 1681  లో  73 సంవత్సరాలు  జీవించి తుది శ్వాస విడిచారన్నారు. , ఈయన అపార శక్తివంతుడు ప్రతిరోజు 1000 సూర్య నమస్కారాలు చేసేవాడని, “శరీర మాధ్యం కలుధర్మసాధనం” అనే భగవద్గీత వచనాలను జీవితంలో  ఆచరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  రుద్రూర్ మండల పతంజలి భారత స్వాభిమానం ట్రస్ట్ అధ్యక్షులు కేవీ మోహన్, యువభారత అధ్యక్షులు జి.పురుషోత్తం,  పతంజలి యోగ సమితి సభ్యులు పుట్టి ప్రకాష్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article