బతుకమ్మ వేల్పూర్: వేల్పూరు మండలం ఇంచార్జీ ఏపీయంగా బి.మాణిక్యం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు డిఆర్ డీ ఏ పిడి సాయ గౌడ్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజు బాధ్యతలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఇన్చార్జి ఏపిఎంను సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేల్పుర్ ఐకెపి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
