- ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ
- విడిసీ రద్దు ఫై జిల్లాజడ్జికి కృతజ్ఞతలు తెలిపిన తాళ్ళ రాంపూర్ గ్రామస్థులు
ఏరగట్ల, బతుకమ్మ : మంచి వ్యక్తిత్వం,మంచితనం,ఓర్పు, సహనం మనుషులకు ఆభరణాలని, సూర్యుని వలె వెలుగుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. తాళ్ళ రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ తన కమిటీని రద్దు చేసుకున్న నేపథ్యంలో గ్రామ గౌడ కులస్తులు, మహిళలతో సహా వచ్చి జిల్లాజడ్జిని జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో కలిసి శాలువ, మొక్క అందజేసిన సందర్భంలో ఆమె వారినుద్దేశించి మాట్లాడారు. న్యాయస్థానాలు అందించే న్యాయం ఒక తీరుగా ఉంటుందని, ప్రకృతి ఒక న్యాయం అందిస్తుందని రెండింటికి తలవాల్సల్సిందేనని పేర్కొన్నారు.అధికారం, ధనబలంతో చేసే ఆధిపత్యం అంతం కాక తప్పదని అన్నారు.సామాజిక వెలివేతలు సమాజ ఉన్నతికి ఉపయోగ పడవని తెలుపుతు, అన్ని సామాజిక వర్గాలు కలిసికట్టుగా ఉండి పల్లెల ప్రగతికి వారదులుగా నిలవాలని ఆమె కోరారు.మనుషులు లలో అహంకారం ఉంటే పతనానికి దారి తీస్తుందని మహా భారతంలో దుర్యోధనుని వృత్తంతాన్ని వివరించారు.తాళ్ళ రాంపూర్ లో విడిసి రద్దు మహిళలు సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు.ఇంకొన్ని రోజులు ఓపికగా ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయని అందుకు న్యాయసేవ సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తుందని జిల్లాజడ్జి భారత లక్ష్మీ భరోసానిచ్చారు.న్యాయసేవ సంస్థ అనేది అందరికి సమన్యాయం అందించడానికి తనవంతు పాత్రను నిర్వహిస్తుందని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. తాళ్ళ రాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోటగిరి రామాగౌడ్, మాజీ ఎంపిటిసి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ఎంతోమంది సామాజిక కార్యకర్తలు గ్రామాన్ని సందర్శించి గౌడ కులస్థులకు విడిసి విధించిన సాంఘిక బహిష్కరణ ఎత్తివేతకు చాలా శ్రమించారని తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ గా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పోలీసు కమిషనర్ ను కదిలించి తీసుకుని వచ్చి బహిష్కరణ బందనాలు తెంపినందుకు రుణపడి ఉంటామని వారు తెలిపారు.

