26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ  ధ్యేయం

Must read

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్

జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ  ధ్యేయమని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వినాయక్ నగర్ లోని అమరవీరుల పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సంక్షేమంతో పాటు సామాజికన్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే అన్నారు. కులగణనను పారదర్శకంగా నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు.  3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నామన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జి పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 58 పాఠశాలల నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లాలో ఈ రబీ 2024-2025 సీజన్ లో 700 కేంద్రాల ద్వారా 8,19,665 మెట్రిక్ టన్నుల ధాన్యంను 1,05,774 మంది రైతుల నుండి కొనుగోలు  చేశామన్నారు.  సన్న వడ్ల బోనస్ క్వింటాలుకు రూ. 500 భాగంగా రబీ 2024-25 లో 7,26,419 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యంను రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు.  ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకారము 1899.52 కోట్ల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేశామన్నారు.  జిల్లాలో 19,490 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,286 ఇండ్లు మంజూరు చేశామన్నారు.  వానాకాలం 2025-26 సీజన్లో వ్యవసాయ శాఖ 5.61 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.    గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాధితుల  ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షల ఎన్ ఆర్ఐ ఎక్స్ గ్రేషియా కింద మొత్తం 2 కోట్ల 75 లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 2024-25 సంవత్సరానికి 42.061 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

The government's goal is the development of all communities.

More articles

Latest article