28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వం అండగా ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

  • రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని  మల్లాపూర్,లోలం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి  గురువారం సందర్శించారు.గత మూడు రోజుల నుండి  భారీ కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందల్వాయి మండలంలో గ్రామాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఇరిగేషన్ ఏఇతో మాట్లాడారు.ప్రమాద దశలో ఉన్న చెరువు కట్టలు,వాగులు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయమన్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు,ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article