ప్రభుత్వం అండగా ఉంటుంది
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్,లోలం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గురువారం సందర్శించారు.గత మూడు రోజుల నుండి భారీ కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందల్వాయి మండలంలో గ్రామాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఇరిగేషన్ ఏఇతో మాట్లాడారు.ప్రమాద దశలో ఉన్న చెరువు కట్టలు,వాగులు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయమన్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున అధికార యంత్రాంగం...