24.2 C
Hyderabad

మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

బతుకమ్మ, పిట్లం : తెలంగాణ రాష్ట్రంలో మహిళల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సంక్షేమ నిధి నుండి మహిళలకు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో 62 రోజులుగా 15 మంది మహిళలు శిక్షణ పొంది వారి కుటుంబాలు లు ప్రయోజనాల కొరకు కుట్టుమిషన్ నేర్చుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరువతో మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగిందని అన్నారు. నేర్చుకున్న విద్య ఎక్కడికి పోదు ప్రతి 15 మంది మహిళలు కుటుంబ పోషణ చేసుకోవాలని కోరారు. అనంతరం హస్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్, చిల్లరికి సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హనుమాన్లు, తాసిల్దార్ రాజా నరేందర్ గౌడ్, ఎంపీడీవో కమలాకర్, పిడి దయానంద్, కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి, చిప్ప శివకుమార్, బొడ్ల రాజు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

The government stands by women.

More articles

Latest article