. . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. ఈ మేరకు బుధవారం నాగారం గోశాల వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోలకు తాళ్లు కట్టి వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఆటో నడుపుకునే వాళ్ళు, కూరగాయలు పండ్లు అమ్మేవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అసంఘటిత కార్మికులకు, సామాన్య ప్రజలకు రెక్కాడితే కానీ డొక్కా నిండదని, కానీ ఇప్పుడు మూడు పూటలు తిండి తినాలంటే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు శ్రీదేవి, రజియా, లలిత, శాంతాబాయి, అనిత, జ్యోతి, సునీత, సంపద, తదితరులు పాల్గొన్నారు.
