27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి

Must read

📰 Generate e-Paper Clip

 

..ఆర్టిజన్ ల ధర్నాకు మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

న్యాయమైన విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. నగరంలోని వర్ని చౌరస్తా లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ చేపట్టిన ధర్నా కు అర్బన్ ఎమ్మెల్యే మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ..ఉద్యోగుల కొత్త డిమాండ్లను ఏమి అడగడం లేదని పాత వాటిని అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధానంగా విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒక రూల్ ఉండే విధంగా చూడాలన్నారు. పని దినాలను తగ్గించి న్యాయం చేయాలన్నారు. గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తున్నా…ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.  ఉద్యోగులకు మద్దతుగా తన వంతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కు వచ్చే మూడు రోజుల్లో లేఖను అందజేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు గంగాధర్, రవి, షాదుల్లా, సతీష్, బీజేపీ కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి, మఠం పవన్, నాయకులు చిరంజీవి, ఇప్ప కాయల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

The government should fulfill the demands of electrical artisan employees
The government should fulfill the demands of electrical artisan employees

More articles

Latest article