29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ లను పరిశీలించిన డీజీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ లను పరిశీలించారు. అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం కోసం డిజిపి శివధర్ రెడ్డి కామారెడ్డి మంగళవారం వచ్చారు. డిజిపికి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా లో నేషనల్ హైవే 44 పై ఉన్న బ్లాక్ స్పాట్ లను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సదాశివ నగర్ వద్ద బ్లాక్ స్పాట్ లను డిజిపి పరిశీలించారు. అక్కడ ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. డీజీపీ వెంట ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి  జిల్లాకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.

More articles

Latest article