. . . సీపీఎం జిల్లా కారద్యర్శి ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మైనార్టీ ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను పాటిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వివిధ కాలనీలకు చెందిన మైనార్టీ ప్రజలు సిపిఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించిన అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం విద్వేషాలను పెంచే పద్ధతుల్లో భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఫలితంగా మైనార్టీలు వివక్షతకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని, అన్ని రంగాల్లో వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చినప్పటికీ అనేకమంది మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ సౌకర్యాలను పొందటంలో వెనకబడుతున్నారని అన్నారు. ప్రధానంగా ఇరుకైన ఇండ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కష్టజీవుల పక్షాన, పేద ప్రజల పక్షాన, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుందని, అందువల్ల ప్రజలంతా ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీలో చేరిన వారిలో షేక్ వసీం, షేక్ సుల్తాన్, రబ్బాని బేగం, రూబియా బేగం, రుక్సానా, సల్మా బేగం, సీమ పర్వీన్, నజియా తవసిం తదితరులు ఉన్నారు.