. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, బతుకమ్మ: ఏడాది కాలంలో పూర్తిగా విఫలమైన రాష్ర్ట ప్రభుత్వానికి దేనిపైనా స్పష్టత లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ప్రకటించిన కులగణన వివరాలపై ప్రభుత్వానికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకుందని, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతగా చూపి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారెంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయిందని పేర్కొన్నారు.
