25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆహార కల్తీపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆహార కల్తీపై తల్లదండ్రులకు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధం ల ఆద్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ఆర్మూర్  అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశము పై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు. ఉప్పు, పప్పులు, వంటనూనెలు మొదలుకొని వివిధ రకాల అయోడిన్ ఉప్పు లు ప్లాస్టిక్ సంచుల్లో అమ్మకం జరుగుతున్నందున మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి చేరడం, క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ ప్యాకింగ్ వలన అయోడిన్ ఉప్పు లక్ష్యం వృధా అయిపోతున్నదని, కాబట్టి అన్ని రకాల ఉప్పు తయారీ దారులు ప్లాస్టిక్ కవర్ లలో ప్యాకింగ్ చేయరాదని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ఒక వేళ ప్యాకింగ్ లో చేస్తే, ఆ ప్లాస్టిక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు ప్యాకింగ్ పై ముద్రించాలని తెలిపారు. కాని వివిధ రకాల అయోడిన్ ఉప్పు తయారీ సంస్థలు నాసిరకం ప్లాస్టిక్ కవర్ లలో ఉప్పు ప్యాకింగ్ చేసి, చిన్న పిల్లలతో సహా అందరికీ క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నారని సాంబరాజు తెలిపారు.   ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు రాజుల రామనాథం, ఉపాధ్యక్షుడు వి.యన్.వర్మ, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు పౌడపల్లి అనిల్,రూరల్ ఇంచార్జీ కార్యదర్శులు యాటకర్ల దేవేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు  నళిని, వెన్నెల వెంకట రమణమ్మ, అంగన్వాడి టీచర్, అంగన్వాడి వెల్పర్స్, విద్యార్థులు, బాలింతలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

Awareness of food adulteration

More articles

Latest article