24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులను, బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు

 

నందిపేట, బతుకమ్మ :  గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు రైతులకు గాని, బీసీలకు గాని ఎలాంటి న్యాయం చేకూర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ స్టేట్ సెక్రెటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు మండిపడ్డారు. నందిపేట మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎలాంటి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఐదు లక్షల బీమా సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అందించడం జరిగిందని అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు భీమా గాని ఎకరానికి 10,000 గానీ ఇప్పటివరకు అందించలేదని అన్నారు. రైతులను మోసం చేయడమే తప్ప ఎలాంటి సహకారం అందించడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని కమిషన్ల పేరుతో కోట్ల రూపాయలు  దండుకోవడమే తప్ప రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పాక్షికంగా చేశారు. ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీచేయాలన్నారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతులకు కనీసం బోనస్ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వేయడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో పల్లె ప్రగతితో పల్లెలను సుందరంగా తీర్చిదిద్యారని కానీ గత రెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో ఒక డ్రైనేజీ కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 80 వేల కోట్లు టిఆర్ఎస్ హాయంలో వెచ్చించడం జరిగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేసి చూపెడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిందలు మోపుతుందన్నారు. అంతేకాక రాష్ట్రంలో విద్యార్థులకు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలకు రుణాలు మంజూరు కాక నాన అవస్థలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటివరకు లోకల్ బాడీ ఎన్నికలను జరపడమే తప్ప వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రజలు అష్ట కష్టాలు పాలవుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కనీసం రైతులకు పోచంపాడు, నిజాంసాగర్ నీళ్లు కూడా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఇకనైనా కళ్ళు తెరిచి రైతులకు పేదలకు ఉండే మూడేళ్లు వారిపై శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో: టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్: నాయుడు రామారావు, మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ , సేవాదళం, జిల్లా అధ్యక్షుడు,డి ఈ, రమణ, మండల మైనారిటీ, అధ్యక్షులు, షేక్, పా, జిల్లా నాయకులు బాల గంగాధర్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article