నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాకేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో ఈనెల 28వ తేదీన జరిగే మానవ హక్కుల వేదిక (HRF ) రాష్ట్ర మాజీ అధ్యక్షులు, న్యాయవాది గొర్రెపాటి మాధవరావు ప్రధమ వర్ధంతి స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని పీవైఎల్- ఐఎఫ్టీయూ నాయకులు అన్నారు. ఈసందర్భగా సభకు సంబంధించిన పోస్టర్లను గురువారం నగరంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వాసరి సాయినాథ్ మాట్లాడుతు మాధవన్న బుటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడరని, మానవ హక్కుల కోసం వివిధ గ్రామాలలో అనేక సదస్సులు నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా నాయకులు దాస్, మండల నాయకులు రంజిత్, సతీష్, సంతోష్, నరేష్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.