29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేజీబీవీ విద్యార్థినీలకు మెటీరియల్ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ:

రుద్రూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ కళాశాల లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు వేద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఇందూర్ విజయభాస్కర్ సహకారంతో ఐఐటీ, జేఈఈ,నీట్  మెటీరియల్ ను పంపిణీ చేశారు. గురువారం రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత – చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థినీలకు స్టడీ మెటీరియల్ పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని పేర్కొన్నారు. ఉన్నత విద్య ఇంటర్మీడియట్ పునాది లాంటిది తెలిపారు. వేద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఇందూర్ విజయభాస్కర్  పేద విద్యార్థులు ఎదగాలని సంకల్పంతో  ఐఐటీ, జేఈఈ,నీట్  ల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను ఉచితంగా అందించి తన ఉదారతను చాటారన్నారు. విద్యార్థులు మంచిగా చదివి ఎదిగిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి మంచి పేరు తీసుకు రావాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, శ్రీకాంత్ గౌడ్, ప్రిన్సిపాల్ శ్యామల, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article