త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల నిర్మాణానికి భూమిపూజ
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
బతుకమ్మ, బిచ్కుంద : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్ల్స్ ల అంశంపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం 12 వ తరగతి వరకు ఈస్కూల్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రభుత్వం గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనున్నదని చెప్పారు.
