29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీయే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను చేపడుతున్నామని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ తో కలిసి అదనపు కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.

 

The goal is to prepare an accurate voter list.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన సమాచారం అందించడంతో పాటు ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, సవరణలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజలు 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రతి అర్హులైన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ అధికారులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

The goal is to prepare an accurate voter list.

More articles

Latest article