రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

0 9,892

 

. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధాని మంత్రిగా చేసే విధంగా కంకణబద్ధులై పని చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 56 వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 లో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాల మన్మోహన్ సింగ్ ప్రధాని గా రాహుల్ గాంధీ ని క్యాబినెట్లోకి తీసుకుంటామని అడిగినప్పుడు రాహుల్ గాంధీ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారన్నారు. అదే విధంగా 2009 లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ ని ప్రధాని చేయాలి అనుకుంటే మీ పాలన బాగుంది మీరే ప్రధానీగా కొనసాగాలని మన్మోహన్ సింగ్ ని ప్రధానిని చేసి ఎలాంటి పదవులు కూడా ఆశించకుండా సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. 2014 తర్వాత దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మత విద్వేషాలకు వ్యతిరేకంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు భారత్ జోడోయాత్రను వానకు, ఎండకు భయపడకుండా పూర్తి చేశారని, తద్వారా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవడం జరిగిందని ఆయనన్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డిసిసి అధ్యక్షులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ 4:30 గంటలు సమయం కేటాయించి, మాతో సామాన్య కార్యకర్తగా కలిసి ప్రతి పనిని చేశారని, ఆ శిక్షణ కార్యక్రమంలో మాకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. మీనాక్షి నటరాజన్ మా అందరికీ ఫ్లోర్ తుడిచే కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారని, ప్రధాని కాబోయే వ్యక్తి చాలా సింపుల్ గా ఉంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ని మీరు ప్రధాని కావాలని ఒప్పుకోవాలని, మీరు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఒప్పించడంతో రాహుల్ గాంధీ ఆ మీటింగ్ లో ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగేష్ రెడ్డి అన్నారు. అనంతరం బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ “నఫ్రత్ కే బజార్ మే, మొహబ్బత్ కీ దుకాణ్ ఖోల్ (ద్వేషంతో నిండిన ఈ సమాజంలో, నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరుస్తున్నాను) అని రాహుల్ గాంధీ నినదిస్తారని తెలిపారు. దేశంలో విద్యావ్యవస్థ విద్యార్థులను వేధించే సాధనంగా మారకూడదని, తప్పు చేసిన మాఫియాపై చర్యలు తీసుకోవాలి కానీ, రాత్రింబగళ్లు కష్టపడే విద్యార్థులపై కాదని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. సత్యం కోసం పోరాడేటప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల గొంతుకను వినిపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల (ఓబిసి, ఎస్సీ, ఎస్టీ) హక్కుల గురించి గళమెత్తుతుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి రమేష్, నూడా చైర్మన్ కేశ వెను, రాష్ట్ర సంక్షేమ చైర్మన్ కవిత రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, ఏఐసీసీ కో ఆర్డినేటర్ గనరాజ్, నగర కోశాధికారి శివ, నగర ఉపాధ్యక్షు లు విజపాల్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, రాజేందర్, రఘు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గణేష్, పంచారెడ్డి చరణ్, సుమన్, కిష్టాగౌడ్, నర్సింగ్, అవీన్, మీనా శర్మ, తదితరులు పాల్గొన్నారు.

 

The goal is to make Rahul Gandhi the Prime Minister.

Leave A Reply

Your email address will not be published.