విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

0 9,974

 

. . . అట్టహాసంగా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ రూపుదిద్దుకుంటుందని, ఈ స్కూల్ పూర్తయిన తర్వాత ప్రాంతీయ విద్యా అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం మోతె గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.

 

The goal is the holistic development of students.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఈ పాఠశాలలో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఒకే చోట చదువుకునే సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్యాంటిన్ సౌకర్యం, వసతి గృహాలు వంటి అన్ని సదుపాయాలతో ఈ విద్యాసంస్థను నిర్మిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్, ఎంఎల్ సి అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్ పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు.

 

The goal is the holistic development of students.

Leave A Reply

Your email address will not be published.