హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. రోడ్లపై 20 వేల టన్నుల చెత్తను పారిశుద్ద్య కార్మికులు తొలగించారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో 4360 విగ్రహాల వ్యర్థాలను తొలగించగా, మరో 2 వేల టన్నుల చెత్త ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తిగా చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగించనున్నారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన సందర్భంగా అధికారులను, పారిశుద్ధ్య కార్మికులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించిన విషయం తెలిసిందే.
