Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 11:52 am Posted by : ramakrishna

ముగిసిన వినాయక నిమజ్జనాలు

హైదరాబాద్,  బతుకమ్మ :  హైదరాబాద్ లో  వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి.  రోడ్లపై 20 వేల టన్నుల చెత్తను పారిశుద్ద్య కార్మికులు తొలగించారు.  ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో 4360 విగ్రహాల వ్యర్థాలను  తొలగించగా,  మరో 2 వేల టన్నుల చెత్త ఉంటుందని అంచనా వేస్తున్నారు.   రెండు రోజుల్లో పూర్తిగా చెత్తను  పారిశుద్ధ్య కార్మికులు తొలగించనున్నారు.  వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన సందర్భంగా  అధికారులను, పారిశుద్ధ్య కార్మికులను  సీఎం రేవంత్ రెడ్డి అభినందించిన విషయం తెలిసిందే.