25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కేసీఆర్ జుట్టులో నుంచి రేవంత్ ఎల్లిండు

Must read

📰 Generate e-Paper Clip

. ఆయన కోకాపేట భూములను తాకట్టు పెడితే

. ఈయన ఏకంగా హెచ్ సీ యూ భూములను అమ్ముతుండు

. ఇది ప్రజాపాలన కాదు.. నియంత పాలన

. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ విమర్శ

హైదరాబాద్, బతుకమ్మ: కేసీఆర్ కోకాపేట భూములను తాకట్టు పెడితే ఆయన జుట్టులో నుంచి ఎల్లిన ఇప్పటి సీఎం రేవంత్ ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముతున్నాడని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ విమర్శించారు. హెచ్ సీ యూకు చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ హెచ్ సీ యూను సందర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్, పాయల శంకర్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో ఉద్రికత్త నెలకొంది.

ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. హెచ్ సీ యూ భూములను విక్రయించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. యూనివర్సిటీ భూములు అమ్మొద్దని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తలలో పెట్టొద్దని విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు భూములు అమ్మొద్దని, ప్రజా అవసరాలకు లైబ్రరీలు,  ఆస్పత్రులు, స్కూళ్లు, పార్కులు కట్టాలని, ఇప్పుడు అధికారంలోకి రాగానే హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న భూములపై కన్నేసి గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. గుంట నక్కల వ్యవహరిస్తున్న రేవంత్ ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, రేపు తెలంగాణను తాకట్టు పెట్టి ఇటలీకి పారిపోతారేమో అని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు సెంటు అమ్మిన ఊరుకునేది లేదని, ప్రజా ఉద్యమంగా మార్చి సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

More articles

Latest article