27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ: మండలంలోని బినోల ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని బినోల, నిజాంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ మగ్గరి హన్మాండ్లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఏ గ్రేడ్ కు రూ.2320, బి గ్రేడ్ కు రూ.2300 మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.

ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు కాంటాను సరి చూసుకోవాలని, ధాన్యం సంచులను లెక్కించుకోవాలన్నారు. సొసైటీల పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడగించడం హర్షణీయమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని హన్మాండ్లు అన్నారు. త్వరలోనే ఆన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.

కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఖాజా ఆషామొద్దీన్, విజయ్, ప్రదీప్ రావు, గంగాధర్, బాలు చందర్, రైతులు పోశెట్టి, మురళి, రమేశ్, పోతన్న, ముషీర్, దేవేందర్, మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Grain purchase centers opened

More articles

Latest article