23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తగ్గేదేలే అంటున్న వరద

Must read

📰 Generate e-Paper Clip

  • గోదావరి, మంజిరా నదులది ఇంకా ఉగ్రరూపమే
  • శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో పలు గ్రామాలు
  • మంజీరా వరద ముప్పు తగ్గలే
  • పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేత

 

నిజామాబాద్, బతుకమ్మ : వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదై రెండు రోజులు గడిచింది. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిసి 48 గంటలు గడిచింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం పడి తేరుకున్నా వరద ముప్పు తగ్గలేదు. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంజీరా, గోదావరి నదుల ఉగ్రరూపం తగ్గలేదు. పైన మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద పోటెత్తుతుంది. కర్ణాటక, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో మంజీరా ప్రవాహం కూడా తగ్గలేదు. తొలిసారి నిజాంసాగర్ ప్రాజెక్టు మీదుగా లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతుండగా కౌలాస్ నాలా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దానితో మంజీరా నది సంగమక్షేత్రం కందకుర్తి వద్ద గోదావరి, హరిద్ర నదులతో సంగమిస్తుంది. మంజీరా, హరిద్రాలకు తోడుగా గోదావరి కూడా వరద వస్తుండడంతో మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రసిద్ది చెందిన రెంజల్ మండలంలోని పలు గ్రామాలు నీటమునిగాయి. 48 గంటల క్రితం వర్షం తగ్గినా నదులకు మాత్రం వరద తగ్గలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నా 3 నదుల నీటి కారణంగా రెంజల్, సాలురా మండలాల్లోని గ్రామాలు నీట మునిగే ఉన్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. వర్షాలు తగ్గినా వరద మాత్రం ప్రభావం చూపుతోంది. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తుండటంతో భారీ గా పంట నష్టం సంభవిస్తోంది. లక్షల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా లో 23 మండలాల పరిధిలో 380 గ్రామాల్లో వరద ప్రభావం చూపింది. నిజామాబాద్ జిల్లాలో 21 మండలాల్లో 145 గ్రామాలను వరద ముంచెత్తింది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు దెబ్బతిన్నాయి. ముంపు ప్రాంతాల్లో పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సాలూరా, రెంజల్ మండలంలో ముంచెత్తిన గోదావరి, మంజీరా నదులు. నీటి మునిగిన ముంపు గ్రామాలు .అప్రమత్తమైన విద్యుత్ శాఖ నీటిలో మునిగిన విద్యుత్ స్తంభాలు. ట్రాన్స్ ఫార్మర్స్ సరఫరా నిలిపివేసి మరమ్మత్తులు చెపట్టారు.రెస్క్యూ టీమ్ తో కలిసి సహాయక చర్యలు చెపట్టి రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నీట మునిగిన సీతారాం ఆశ్రమం జలదిగ్బంధం లో  గోవులను రక్షించారు.

జిల్లాలో గోదావరి మంజీరా నదులు ఉప్పొంగాయి. దీంతో ముంపు గ్రామాలను వరద ముంచెత్తింది. బోధన్ సాలూరా మండలాల్లోని హుంస, మంధర్నా,  హాంగర్గ, ఖాజా పూర్ గ్రామాలను ఖాళీ చేయించారు. ట్రాక్టర్లు, బోట్ల సహాయంతో పునరావాస క్రేంద్రాలకు తరలించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఉదృతంగా ప్రవహిస్తోంది. సాలూరా వద్ద పాత బ్రిడ్జిపై నుంచి వరద పారుతుంది. ఖండ్ గాం బ్రిడ్జి నుంచి వరద పారుతుండటంతో రాకపోకలను నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంను వరద ముంచెత్తింది. గోదావరి పుష్కర ఘాట్ తో పాటు పలు ఆలయాలు నీట మునిగాయి. శివాలయ ఆశ్రమంలో చిక్కుకున్న వారిని స్థానికులు పోలీసుల సహాయంతో రక్షించారు. కందకుర్తి వద్ధ ఉన్న తెలంగాణ – ధర్మబాద్ బ్రిడ్జి పైనుంచి వరద పోంగిపోరులుతుంది. దానితో ధర్మాబాద్ కు రాకపోకలు బంద్ చేశారు. బాసర – నవీపేట్ రహదారిపై యంచ వద్ధ గోదావరి నది ఉగ్రరూపం ప్రదర్శించింది. శనివారం ఉదయం ప్రధాన రహదారిపై నుంచి వరద పారింది. కొత్త రైల్వే, రహదారి బ్రిడ్జీలకు సమీపంలో ప్రవాహం ఉండటంతో బాసర వద్ద గంగాదేవి విగ్రహం వరకు వరద పొంగి ప్రవహిస్తోంది.

The flood that says it will not subside

More articles

Latest article