26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్‌కు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పాఠశాల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్, షూలు, టైలు, బెల్టులు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు. ఎంఆర్‌పీ ధరల కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ ఫీజు, రోబోటిక్స్, గేమ్స్ వంటి పేర్లతో అదనపు చార్జీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తల్లిదండ్రుల పరిస్థితులను ఆసరాగా చేసుకొని కొన్ని పాఠశాలలు లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఒక్కో పాఠశాల స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి విద్యను వ్యాపారంగా మార్చే విధానాన్ని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు మనోజ్, శ్రీకర్, భవాని, అరవింద్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article