ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి
. . . పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్‌కు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని...