27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపాధి పనుల గుర్తింపు ప్రక్రియ సత్వరమే పూర్తి చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీడీఓ సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని అన్ని గ్రామాల్లో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కొత్త ఉపాధి పనుల గుర్తింపు ప్రక్రియ సత్వరమే పూర్తి చెయ్యాలని ఎం పీ డీ ఓ సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం లో ఉపాధి హామీ పనులపై రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సంబంధించిన ఈకెవైసీని వెంటనే పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి బేస్మెంట్,  పైకప్పు లెవెల్ పేమెంట్లు వెంటనే పూర్తి చేయాలని, నర్సరీల నిర్వహణ,  వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలన్నారు. మెటీరియల్ పనులకు సంబంధించి పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వేగవంతం చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు ప్రతి గ్రామంలో ప్రారంభించాలని,కూలీలకు కనీస వేతనం వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ రివ్యూ మీటింగ్ లో ఉపాధి హామీ ఏపీవో జీ నర్సయ్య,  ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు,సీనియర్ మెట్లు పాల్గొన్నారు.

More articles

Latest article