డయల్ 100 మిస్ యూస్.. ఒకరికి 4 రోజుల జైలు శిక్ష

0 12,568

మెండోరా, బతుకమ్మ: టైల్ 100 మిస్ యూస్ చేసిన వ్యక్తికి నాలుగు రోజులు జైలు శిక్ష పడినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండల కేంద్రానికి చెందిన సందేశ్ బాబు అనే వ్యక్తి మద్యం సేవించి అనవసరంగా డయల్ 100 కాల్ చేసినందుకు మెండోరా పోలీస్ వారు అతనిపై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 4 రోజులు జైలు శిక్ష విధించినట్లు  ఆమె పేర్కొన్నారు. ఎవరైనా పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ అయిన డయల్ 100 ను మిస్ యూస్ చేసినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.