27.4 C
Hyderabad

అస్థవ్యస్థ కేబుళ్లను తొలిగించిన విద్యుత్ శాఖ

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆర్ ఆర్ చౌరస్తా నందు 11 కేవి రాజరాజేంద్ర ఫీడర్ విద్యుత్ స్థంభం పై అస్తవ్యస్తంగా ఉన్న డిష్, ఇంటర్నెట్ కేబుల్స్ ను తొలగించారు.  రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో రామంతాపూర్ ఏరియా లో డిష్ కేబుల్స్ వల్ల విద్యుత్ ప్రమాదం జరిగి ఐదుగురు ప్రమాదవ శాత్తు మరణించిన విషయం  తెలిసిందే. రాబోయే రోజుల్లో వినాయక చవితి పండగ గణేశ్ విగ్రహాల తరలింపు , ఊరేగింపు సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త గా మంగళవారం విద్యుత్ స్థంభాల పై ఉన్నకేబుల్ తీసీ వేశారు. విద్యుత్ శాఖ వారు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధి లో గల కేబుల్ , ఇంటర్నెట్ ఆపరేటర్లు మీ యొక్క కేబుల్స్ ను సక్రమ పద్ధతిలో క్లిప్పింగ్ క్లాంపిన్ పద్ధతి అనుసరించి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని సహకరించాలని  విధ్యుత్ శాఖా అధికారులు తెలిపారు.

The Electricity Department removed the damaged cables.

More articles

Latest article