27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పకడ్బందీగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తహసీల్దార్ బాలయ్య

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని స్టేషన్ తండా, నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో తహసీల్దార్ బాలయ్య పోలింగ్ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), సూపర్వైజర్లతో కలిసి శుక్రవారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాలను పకడ్బందీగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బీఎల్ఓలు యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని, అలాగే ఆన్‌లైన్ ద్వారా ప్రింట్ తీసిన ఎన్యుమరేషన్ ఫారాలనే పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సజావుగా జరిగేలా బీఎల్ఓలకు అవసరమైన సూచనలు అందించినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, సంబంధిత బీఎల్ఓలు, జీపీఓలు, అంగన్‌వాడీ టీచర్లు, శోభ, పూజం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article