లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట్ మండలం శెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ చేసినట్లు సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు బాధితుని ఇంటికి వెళ్లి చెక్కును పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన గోనె లింగం రూ.60,000 ల చెక్కును పంపిణీ చేసినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శెట్పల్లి గ్రామ ఉప సర్పంచ్ మన్నే బాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య, ఉపాధ్యక్షులు సాయగౌడ్ పాలకవర్గ సభ్యులు. లింగాగౌడ్, అశోక్, ఆంజనేయులు, బాలరాజు, అరవింద్, ప్రభురాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
