23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

గురుకుల కళాశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల(ఇంటర్) మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని పీడీఎస్ యూ నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేశ్ మాట్లాడుతూ..1985 నుంచి నేటి వరకు ఇంగ్లిష్ మీడియం లో దళిత విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఎన్నో అవకాశాలు అందించడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో గురుకుల కళాశాల ఇంటర్ విద్యను దళిత విద్యార్థులకు దూరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. మొత్తం 12 గురుకుల కళాశాలల్లో 8 బాలికల కళాశాలలున్నాయని తెలిపారు.

వెంటనే గురుకుల కళాశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకుని రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియమించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోనాయకులు సృజన్, నాగేష్, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article