వీధి కుక్కల దాడిలో జింక మృతి

0 2,655

పొతంగల్, బతుకమ్మ: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మండలంలోని యాద్గార్ పూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

యాద్గాపూర్ శివారులోని వ్యవసాయ పొలల్లో నుంచి గ్రామం వైపునకు వీధి కుక్కలు జింకను తరిమి దాడి చేశాయి. స్థానికులు గమనించి వీధి కుక్కలను తరిమివేశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని జింకను వెంటనే పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. జింకకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. వీధి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోందని, మనుషుల పై సైతం దాడులు చేస్తున్నాయని అన్నారు. వీధి కుక్కల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.