గురుకుల కళాశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల(ఇంటర్) మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని పీడీఎస్ యూ నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేశ్ మాట్లాడుతూ..1985 నుంచి నేటి వరకు ఇంగ్లిష్ మీడియం లో దళిత విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఎన్నో అవకాశాలు అందించడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో గురుకుల కళాశాల ఇంటర్ విద్యను దళిత విద్యార్థులకు దూరం చేయాలనుకోవడం...