27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బిసీలను అణగదోక్కిన ఘనత కాంగ్రెస్ పార్టిది

Must read

📰 Generate e-Paper Clip

. . . మండల్ కమీషన్ అమలు చేసినందుకు విపీసింగ్ ప్రభుత్వంను బిజేపి కులదోసింది

. . . బిసీలకు రిజర్వేషన్ లను కలిపించిందే ప్రాంతీయ పార్టీలే

. . . జాగృతి బిసీ మహ సభ పెట్టగానే రేవంత్ ప్రభుత్వానికి సావిత్రిబాయి పూలే జయంతి అధికారికంగా చేసింది

. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైద్రాబాద్, బతుకమ్మ:

బిసీలను అనాటి నేహ్రు నుంచి నేటి సోనియా గాంధి వరకు అణగ దోక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టికి ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆద్వర్యంలో శుక్రవారం బిసి మహసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొనగా, 80 పైగా బిసి సంఘాల నాయకులు, బిసి ప్రజా ప్రతినిధులు హజరయ్యారు.

The credit of undermining the BCs belongs to the Congress party

మొదట సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కామారెడ్డి బిసి డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం సంతకాల సేకరణ లో ఎమ్మెల్సీ కవిత,బిసి సంఘాల నాయకులు సంతకాలు చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతు…కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో  అణగారిన వర్గాల వారికి తమ హక్కుల కోసం  తోలి ప్రధాని నేహ్రు బిసీ రిజర్వేషన్ ల అమలుకు చిత్త శుద్ధితో పని చేయలేదు అన్నారు. ఇందిరా గాంధి చట్టం చేస్తామని  10 సంవత్సరాలు దానిని బిరువాలో భద్రపరిచారని అన్నారు. కాంగ్రెసేత ప్రధానిగా విపి సీంగ్ బిసీ రిజర్వేషన్ లు అమలు చేసేందుకు బిపి మండల్ కమీషన్ ఎర్పాటు చేశారన్నారు. ఇదే అంశంపై రాజీవ్ గాంధి పార్లమెంట్ లో మాట్లాడుతు బిసీలకు రిజర్వేషన్ లో అమలు చేస్తే దేశం విచ్చిన్నం అవుతుందన్నారు.  విపి సీంగ్ అధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం బిసీ రిజర్వేషన్ లను అమలు చేస్తే అ ప్రభుత్వానికి మద్ధత్తు ఉప సంహరించుకోని కులదోసిన ఘనత బిజేపిదని మండిపడ్డారు.

 

The credit of undermining the BCs belongs to the Congress party

సోనియా గాంధి హయంలోరూ.4500 కోట్లతో  కుల గణన చేసిన అమలు చేయలేదు అని కవిత ఆరోపించారు. బిజేపి తాము కులగణనకు వ్యతిరేకం అని బల్లగుద్ధి చేబుతున్నారు. బిసీలకు న్యాయం చేసింది కేవలం ప్రాంతీయ పార్టిలు మాత్రమేనని కవిత అన్నారు. కేవలం బీసీలకు న్యాయం చేసింది ప్రాంతీయ పార్టిలు అని లెక్కలుచేబుతాయి, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రధానంగా జాతీయ పార్టిల హయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం బిజేపి అధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా లేక్కలు చేయడానికి సిద్ధమౌతుంది అప్పుడు కుల గణన చేయాలని కోరుతున్నాం అన్నారు. రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తరువాత ఎన్నికలకు వెలుతామని హమీ ఇచ్చారు. కర్నాటకలో, బిహర్, మహరాష్ర్టలో కాంగ్రెస్ ఫేయిల్ కావడంతో వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణ జాగృతి విన్నవించిన, హై కోర్టు మెట్టికాయలు వేసిన తరువాత రేవంత్ రెడ్డి ప్రక్రియ ప్రారంభించారు. డేడికేషన్ కమీటి పని ఆలస్యంగా ప్రారంబించిందన్నారు. తెలంగాణ జాగృతి బీసీల కోసం మహధర్నా చేపట్టిన వేంటనే కాంగ్రెస్ పార్టి బిసీ బాట నామాన్ని జపించడం ప్రారంభించిందన్నారు.

 

The credit of undermining the BCs belongs to the Congress party

More articles

Latest article