మొక్కజొన్న కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు తప్పనిసరిగా పొందాలని, ఇందుకోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోర్తాడ్ వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. రైతులు మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలని ఆయన పేర్కొన్నారు   ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2400 మద్దతు ధర తమకు లభిస్తుందని రైతులకు తెలియజేశారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించుకోవచ్చని, తద్వారా ఆర్థికంగా బలోపేతం...