26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తొందరగా పూర్తి చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్మితం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని అన్నారు, స్లాబ్ లెవల్ పూర్తయిన ఇళ్లకు కూడా బిల్లు క్లియర్ చేయడం జరిగిందన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వార్డ్ ఆఫీసర్లకు తెలియజేయాలని అన్నారు. వెను వెంట పనులను పరిశీలిస్తూ,తొందరగా పూర్తి చేయించాలని వార్డ్ ఆఫీసర్లను ఆదేశించారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు వారికి సంబంధించిన మేస్త్రీలను ఆదేశించినారు. వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article