ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తొందరగా పూర్తి చెయ్యాలి

కమిషనర్ గోపు గంగాధర్   భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్మితం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని అన్నారు, స్లాబ్ లెవల్ పూర్తయిన ఇళ్లకు కూడా బిల్లు క్లియర్ చేయడం జరిగిందన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వార్డ్ ఆఫీసర్లకు తెలియజేయాలని...