28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కారుణ్య నియామకాలు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టీపీసీసీ అధ్యక్షునికి తెలంగాణ పంచాయత్ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ లో విధినిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం పథకం కింద జూనియర్ సహాయకులుగా నియమించాలని తెలంగాణ పంచాయత్ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు  వినతి పత్రం అందజేశారు. 2023 ఆగస్ట్ నుంచి పెండింగ్ లో ఉన్న 50మంది అభ్యర్థులకు అటెండర్ పోస్టును అప్ గ్రేడ్ చేసి జూనియర్ అసిస్టెంట్ గా నియమించి సూపర్ న్యూమరి నియామకంగా సూచించారు. జిల్లాలో నియమించిన ఇద్దరు అభ్యర్థులు రెండు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేశారని తెలిపారు. సర్వీసు రెగ్యులర్ కోసం దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అభ్యర్థలు సూపర్ న్యూమరి పోస్ట్ నందు నియమించడినందున కమిషనర్ పీఆర్ అండ్ ఆర్ఈ హైదరాబాద్ నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతనే సర్వీసు రెగ్యులర్ చేస్తామని అంటున్నారని తెలిపారు.

More articles

Latest article