26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యాంగం ఒకే కుటుంబం లాగా బతికే స్వేచ్ఛనిచ్చింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐక్యూఏసీ కో ఆర్డినేటర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

భారత దేశం లో ఎన్నో జాతులు, మతాలు, కులాల వారు జీవిస్తున్నప్పటికి ఒకే కుటుంబం లాగ జీవించే స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం ఇచ్చిందని, అందుకు కారణం డా.బి.ఆర్.అంబేద్కర్ అని కళాశాల ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ శంకరయ్య తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మంగళవారం కళాశాలకు సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే ఈ వేడుకలు నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మి నారాయణ తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ అంబేద్కర్ జీవితం గురించి, తాను కష్టపడి చదివిన చదువు గురించి విద్యార్థులకు తెలియజేసారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.యం చంద్ర కాంత్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని దానిని రచించిన ఘనత డా.బి.ఆర్.అంబేద్కర్ ది అని గుర్తు చేసారు. కళాశాల టీఎస్కేసీ కో ఆర్డినేటర్ శివ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ చదువు, తాను పొందిన డాక్టరేట్ పట్టాల గురించి వివరించారు. భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు నాగనీక, డా.బి.అరుణ్ కుమార్, డా.గంగా రెడ్డి, డా.సిద్దు రాజు, కృష్ణ ప్రసాద్, డా.యస్.గోదావరి, శశిధర్, సంతోష్, చంద్ర కాంత్, రాణి, మోహిన్, సంగీత, కీర్తి స్వప్న, దశరథ్, మై మూద్ కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

The Constitution gives us the freedom to live as one family.

More articles

Latest article