24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎ.మహేష్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

డిగ్రీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి మంచి విద్యాలయాల్లో సీట్లు సంపాదించి, ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎ.మహేష్ అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తృతీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి కమిటీ మెంబర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు సరి సమానమైన పోటీలో నిలుస్తున్నారన్నారు. మంచి ఉద్యోగం సంపాదించి, ఉజ్వల భవిష్యత్తు కు నాంది పలకాలని వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ విద్యార్థులు నిత్య క్రమశిక్షణతో ఉంటూ, ప్రతిక్షణం చదువు మీద శ్రద్ధ వహించేవారన్నారు. వారి సమయాన్ని వృధా చేయకుండా పీజీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి కౌన్సిలర్స్ దశరథ్, గాఫర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.చంద్రకాంత్, ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ వి శంకరయ్య, టి ఎస్ కే సి సమన్వయకర్త శివకుమార్, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎస్.చంద్రకాంత్, జి.రాణి, నాగనిక, డా.అరుణ్ కుమార్, డా.సిద్దిరాజు, డా.గంగారెడ్డి శశిధర్, మోహిన్ సంగీత, కిరణ్ కుమార్, స్వప్న మహిముద్, వసంత లక్ష్మి, అధ్యాపకేతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article